హవ్వ.. సీతను ఎత్తుకెళ్లింది రాముడా? గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ నిర్వాకం!

- Advertisement -

అహ్మదాబాద్: ‘రామాయణమంతా విని.. రాముడు, సీతకు ఏమవుతాడు?’ అని అడిగాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ‘రామాయణం’లోని కీలకమైన ఘట్టాన్నే మార్చేశారు. గుజరాత్‌లోని ఏడో తరగతి సంస్కృత పుస్తకంలో వచ్చిన ఈ తప్పిదం ఇప్పుడు చర్చనీయంగా మారింది. దీనిపై బోర్డు కూడా వివరణ కూడా ఇచ్చింది.

సీతమ్మను.. రావణుడు ఎత్తుకుపోయాడంటూ లక్ష్మణుడు.. రాముడికి వివరించే సన్నివేశంలో ‘‘సీతమ్మను రాముడు ఎత్తుకెళ్లాడు’’ అని ఉంది. దీంతో ఇది వివాదంగా మారింది. దీనిపై గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్ పెహానీ స్పందిస్తూ.. ‘‘అనువాదంలో ఏర్పడిన లోపం వల్ల రావణుడికి బదులుగా రాముడు అని అచ్చయ్యింది. గుజరాతీ పుస్తకంలో మాత్రం ఇది సరిగానే ఉంది..’’ అని చెప్పారు.

- Advertisement -
- Advertisement -