తమిళనాడులో కరోనా విలయ తాండవం.. మరో మంత్రికి సోకిన వైరస్

- Advertisement -

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రులు కరోనా బారినపడగా తాజాగా సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు వైరస్ సంక్రమించినట్టు శుక్రవారం నిర్ధారణ అయింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. మంత్రితో ఫోన్‌లో మాట్లాడానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తెలిపారు.

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పి.తంగమణి, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.అన్బళగన్‌ ఇటీవల కరోనా బారినపడ్డారు. తాజాగా సెల్లూర్ కె. రాజుకు కరోనా సోకినట్టు తెలియడంతో మంత్రుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

- Advertisement -
- Advertisement -