తమిళనాడులో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. నేడు ఒక్క రోజే 64 మంది మృతి

corona-pandemic-in-tamil-nadu
- Advertisement -

చెన్నై:  తమిళనాడులో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. నేడు కొత్తగా  3,680  కరోనా పాజిటివ్ కేసులు  నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది.

కరోనా కారణంగా నేడు ఒక్కరోజే 64 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల  సంఖ్య  1,30,261కు చేరింది.

- Advertisement -

ప్రస్తుతం 46,105  మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు  82,324  మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య  1,829కు పెరిగింది. తాజా కేసుల్లో అత్యధిక శాతం చెన్నైలోనే నమోదు కావడం గమనార్హం.

- Advertisement -