ఆరోపణలు నిరూపించు.. లేకపోతే 100 గుంజీళ్లు తీయాలి: మోడీకి మమత సవాల్

7:57 am, Fri, 10 May 19

కోల్‌కతా: ప్రధాని మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ…రాజకీయాన్ని మరింత వేడెక్కించారు.

తాజాగా వీరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలకు బొగ్గు మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి మమతా బెనర్జీ మోడీపై ఫైర్ అయ్యారు.

చదవండిఇలాంటి ప్రధానిని నా జీవితంలో చూడలేదు: మోడీపై బాబు ఘాటు వ్యాఖ్యలు!

మోడీకి దమ్ముంటే ఆ ఆరోపణలని నిరూపించాలంటూ మమతా సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపిస్తే.. తమ 42 మంది ఎంపీ అభ్యర్థులను బరి నుంచి తప్పిస్తామని చెప్పారు. ఒకవేళ ప్రధాని చేసిన ఆరోపణలను బీజేపీ రుజువు చేయలేకపోతే మోడీ చెవులు పట్టుకుని వంద గుంజీళ్లు తియ్యాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెంపదెబ్బ వ్యాఖ్యలు…

కాగా, ఈనెల 7న ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడంతో ఆయన్ను చెంప దెబ్బ కొట్టాలన్నంత కోపం వచ్చిందని మమతా బెనర్జీ అన్నారు.

ఇక ఈ వ్యాఖ్యలపై మోడీ స్పందిస్తూ… దీదీ తనని చెంపదెబ్బ కొట్లాలనుకుంటోందని, ఆమెను తన సోదరిగా భావిస్తునని చెప్పారు. ఇక మీ చెంపదెబ్బ తనకు ఆశీస్సులతో సమానమని, కానీ, చిట్ ఫండ్ పేరుతో జనం డబ్బులు దోచుకున్న వారిని కొట్టే ధైర్యం ఉందా అని అడిగారు. మొత్తానికి మమత ఫ్రస్ట్రేషన్ ఆమె హావభావాల్లో కనిపిస్తోందని  అన్నారు.

చదవండి: రాజీవ్‌గాంధీపై పీఎం మోడీ సంచలన వ్యాఖ్యలు! ఖండించిన బీజేపీ సీనియర్ నేత!