భారత్‌లో కనుమరుగైన ‘టిక్ టాక్’ యాప్!

3:54 pm, Wed, 17 April 19
Latest Tik Tok Latest News, Latest India News, Newsxpressonline

ఇండియా: ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్ ఇక లేనట్టే.. దీన్ని బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్ డౌన్‌లోడ్లను నిషేధించాలని మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా చిన్నారుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని సూచించింది. ఈ యాప్‌ను అందిస్తున్న చైనా సంస్థ బైటెడెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

చదవండి: స్కానింగ్ చేసిన డాక్టర్లు షాక్.. అమ్మ కడుపులోనే కొట్టుకుంటున్న కవలలు!

భారత్ వంటి పెద్ద మార్కెట్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేని ఈ సంస్థ తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమైంది. అటు-సుప్రీంకోర్టును ఈ సంస్థ ప్రతినిధులు ఆశ్రయించగా.. కేసును మద్రాసు హైకోర్టుకే బదిలీ చేసింది.. అటు కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని కోరుతూ ప్రభుత్వం యాపిల్, గూగుల్‌లకు ఓ లేఖ రాసింది.

ఇండియాలో టిక్‌టాక్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.  యూజర్లు స్పెషల్ ఎఫెక్టులతో షార్ట్ వీడియోలను క్రియేట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. అయితే దీని కంటెంట్ అసభ్యంగా ఉంటుందని కొందరు పొలిటికల్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో యూజర్లు కొన్ని కోట్లసార్లకు పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

గత జనవరిలోనే సుమారు 3 కోట్లమంది దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నారట. ఇంత పాపులర్ అయిన ఈ యాప్‌ను గూగుల్ బ్లాక్ చేయడంతో వీళ్ళంతా ఉసూరుమంటున్నారు.

చదవండి: షాకింగ్: 49 మంది పిల్లలకు ఆ డాక్టరే తండ్రి.. కోర్టుకెక్కిన బాధిత మహిళలు