దూసుకుపోతున్న టిక్‌టాక్ రైవల్ మిత్రోన్ యాప్.. డౌన్ లోడ్లే.. డౌన్‌లోడ్లు!

- Advertisement -

న్యూఢిల్లీ: టిక్‌టాక్ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన చేసిన తర్వాత స్వదేశీ యాప్ మిత్రోన్‌ దూసుకుపోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండు నెలల్లోనే కోటి డౌన్‌లోడ్ల మైలురాయిని అందుకున్న మిత్రోన్ యాప్.. ఆ తర్వాత వారంలోనే 1.7 కోట్ల డౌన్‌లోడ్లకు చేరుకోవడం విశేషం.

యాప్‌కు పాప్యులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో రెండు వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు ‘3 వన్ 4’, ‘లెట్స్ వెంచర్’ల నుంచి నుంచి రెండు కోట్ల రూపాయలను సమకూర్చుకుంది. ఈ నిధులతో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది.

- Advertisement -

అంటే నైపుణ్యం ఉన్న కొత్త వారిని తీసుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, ఇండియన్ కంటెంట్ క్రియేటర్లతో ఎంగేజ్ కావడం వంటివి చేయనుంది.

కంటెంట్ నిర్మాణంతోపాటు దేశీయ కంటెంట్ క్రియేటర్లపై దృష్టి సారిస్తామని ‘మిత్రోన్’ వ్యవస్థాపకుడు శివాంక్ అగర్వాల్ తెలిపారు.

 

- Advertisement -