సర్జికల్ స్ట్రయిక్స్‌పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు! రాజమౌళి, రామ్ చరణ్, మహేష్ బాబు ఏమన్నారంటే…

2:56 pm, Tue, 26 February 19
india vs pakisthan at pulwama attack

mahesh babuహైదరాబాద్ : భారత-పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన శిబిరాలపై భారత్ మరోసారి సర్జికల్ స్ట్రయిక్ జరపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు.

ముఖ్యంగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, రాంచరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా మరికొందరు భారతీయ వైమానిక దళం సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని అవంతిపుర వద్ద కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశంలోని ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మన దేశం ఇందుకు బదులు తీర్చుకుంది. భారత వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రయిక్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన 300 మంది తీవ్రవాదులను తుదముట్టించింది.

టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు…

భారత అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం నియంత్రణ రేఖకు ఆవల 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్‌ ప్రాంతంలోని జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్ర స్థావరాలపై మన వాయుసేన ఒక్కసారిగా విరుచుకుపడింది. వాయుసేన దాడులలో జైషే మహమ్మద్‌ సీనియర్ కమాండర్లు, కరుడుగట్టిన తీవ్రవాదులు, ట్రైనీలు ఇతర జిహాదీలు పెద్ద సంఖ్యలో హతమైనట్లు  విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.

కాగ, ఈ సర్జికల్ స్ట్రయిక్ చేసి, భారతదేశం యొక్క గొప్పదనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన భారత వాయుసేనకి, మిరేజ్ 2000 జెట్ ఫైటర్ల పైలట్లకు టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, రాంచరణ్, సూపర్ స్టార్ మహేష్ ఇంకా కొంతమంది పలువురు తమ అభినందనలు తెలిపారు.


మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, “ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్..” అన్నారు. ఇదే దాడులపై స్పందించిన ఎన్టీఆర్ “మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా..” అని ట్వీట్ చేయగా, “సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్… జై హింద్” అని రాజమౌళి, “భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా… జై హింద్” అని రామ్ చరణ్ ట్వీట్లు పెట్టారు.

సంబంధిత వార్తలు