కోవిడ్ చికిత్సకు అందుబాటులోకి మరో ఔషధం.. ‘డెక్సామెథాసోన్‌’కు కేంద్రం అనుమతి

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి కట్టడి వేసే ప్రయత్నాల్లో భాగంగా మరో ఔషధానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నయం చేసేందుకు ఉపయోగించే లో-కాస్ట్ స్టెరాయిడ్ డ్రగ్ డెక్సామెథాసోన్‌ను కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు అనుమతి లభించింది.

ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయిలో లక్షణాలున్న కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు మిథైల్‌ప్రెడ్నిసోలోన్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించింది.

- Advertisement -

ఇతర ఉపశమన చర్యలతో పాటు ఈ మందును కూడా వాడొచ్చని కేంద్రం తెలిపింది. కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడడంలో డెక్సామెథాసోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైంది.

దీంతో ఈ డ్రగ్ ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఈ ఔషధ వినియోగానికి అనుమతి ఇచ్చింది.

- Advertisement -