అన్‌లాక్ 3.0: ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లకు అనుమతి.. జిమ్ లకు మాత్రం..’నో’..

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా అన్‌లాక్‌ 3.0లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్ల పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతించింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) అనిల్‌ బైజల్‌ అధ్యక్షతన నేడు జరిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

ప్రయోగాత్మకంగా కొవిడ్‌-19 నిబంధనలతో వారాంతపు సంతలను అనుమతిస్తామని డీడీఎంఏ పేర్కొంది. అయితే, జిమ్‌లకు మాత్రం అనుమతి నిరాకరించారు.

ఢిల్లీలో కరోనా వైరస్‌ నెమ్మదించిన క్రమంలో హోటళ్లు, జిమ్‌లు, వారాంతపు సంతలను అనుమతించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకునే హక్కు తమకుందని ఆప్‌ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలో పేర్కొంది.

ఢిల్లీలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తగ్గడంతో నగర ప్రజలను వారి జీవనోపాధికి దూరంగా ఉంచరాదని రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌జీని కోరింది.

- Advertisement -