ముగిసిన ట్రంప్ రెండు రోజుల పర్యటన.. భార్యతో కలిసి ఫైట్ ఎక్కిన అమెరికా అధ్యక్షుడు

11:32 am, Wed, 26 February 20

న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాంనాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరైన ట్రంప్ దంపతులు.. రాత్రి 10:32 గంటలకు అమెరికాకు పయనమయ్యారు.

అంతకు ముందు విందులో ట్రంప్‌ మాట్లాడుతూ… ‘భారత్‌, అమెరికా మధ్య సత్సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. మొతేరా స్టేడియంలో తనకు లభించిన ఘన స్వాగతాన్ని స్మరించుకున్న ట్రంప్.. భారత్‌పైనా, ఇక్కడి ప్రజలపైనా అపారమైన గౌరవం ఉందన్నారు.

భారత్‌లో గడిపిన ఈ రెండు రోజులను తాను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాలపై రూ.21,500 కోట్ల ఒప్పందం జరిగింది. చమురు, ఆరోగ్య రంగాల్లో మరో రెండు ఎంవోయూలు జరిగాయి.

చదవండి: షాకింగ్: నాకు మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: ఇండియా టూర్‌లో ట్రంప్ వ్యాఖ్యలు…