ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత వైద్యుడికి కరోనా

- Advertisement -

డెహ్రాడూన్: అన్‌లాక్-1 తర్వాత దేశంలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రముఖులు కూడా ఒక్కొక్కరే కరోనా బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎన్‌ఎస్ బిష్త్‌ కరోనా బారిన పడ్డారు.

దీంతో ఆయన ఎవరెవర్ని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాంటాక్ట్ కేసులను అన్నింటినీ త్వరగానే గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామని ఉత్తరాఖండ్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం నలుగురు వైద్యులకు కరోనా సోకింది. మరో 17 మంది సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు.వీరు డూన్ ఆస్పత్రిలో సిబ్బందిగా తెలుస్తోంది.

- Advertisement -

కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,177 కరోనా కేసులు నమోదు కాగా, 718 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,433 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి 26 మంది మరణించారు.

- Advertisement -