సొంత అన్ననే చంపబోయిన సైకో.. అన్న పిల్లలను కూడా..

- Advertisement -

పైశాచికానందంతో ఎదుటివారిని చిత్ర హింసలకు గురిచేసి చంపుతుంటారు కొందరు. ఇలాంటి వారిని మనం సైకోలు అని పిలుచుకుంటుంటాం.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఓ సైకోని పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

తోడబుట్టిన అన్నను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ సైకో కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు.

యూపీలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..

ఈటా జిల్లా ధర్మపూర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే ఆరేళ్ల చిన్నారి ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

ఈ నెల 9న సత్యేంద్ర తమ్ముడు ప్రశాంత్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ఈ కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే అనుమానితులే కానీ అసలు దోషులెవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో విచారణ ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 11న చిన్నారుల చిన్నాన్న అయిన రాధేశ్యామ్ తన సొంత అన్న విశ్వనాథ్ సింగ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

విశ్వనాథ్ నిద్రపోతున్న సమయంలో కత్తితో దాడికి యత్నించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దీంతో అన్నను హత్యచేయడానికి గల కారణాలను విచారిస్తుండగా పోలీసులకు రాధేశ్యామ్‌ సంచలన విషయాలను వెల్లడించాడు. 

ఈ విషయాలు విన్న పోలీసుల రాధేశ్యామ్ చెప్పిన విషయాలు విని పోలీసులు నిర్ఘాంతపోయారు.

తనకు మనుషుల్ని చంపడమంటే ఇష్టమని, సత్యేంద్ర, ప్రశాంత్‌లను కూడా తానే హత్య చేశానని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

అయితే చిన్నారుల హత్య కేసు మిస్టరీ వీడినందుకు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని పోలీసులు నిర్ణయించారు.

 

- Advertisement -