‘శత్రువు ముందు తలొగ్గి ఉంటే బలహీనులమని కాదు’!: వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్…

1:16 pm, Tue, 26 February 19
indian army

Air_Force

న్యూఢిల్లీ: భారత యుద్ధవిమానాలు నియంత్రణ రేఖ(లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌వోసీ)ని దాటి బాంబు దాడులు జరిపినట్లు భారత వైమానిక దళంలోని విశ్వసనీయ వర్గాలు బీబీసీకి తెలిపాయి. ఈ యుద్ధవిమానాలు పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరం నుంచి బయల్దేరాయి. ఎల్‌వోసీని దాటి ఆవల ఉన్న నిర్దేశిత లక్ష్యాలపై బాంబులు వేశాయి.

30 నిమిషాల్లో ముగిసిన ఆపరేషన్..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించిన వచ్చిన తరువాత, భారత ఆర్మీ ఓ హిందీ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ, ట్వీట్ చేయగా, ఆ ట్విట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

భారత సైన్య ప్రజా సంబంధాల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్, తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ దినకర్ రచించిన పద్యాన్ని ఉంచారు. కౌరవ, పాండవులను పోల్చుతూ సాగిన ఈ ట్వీట్ లో శత్రువు ముందు తలొగ్గి ఉన్నామన్నంత మాత్రాన బలహీనులమని కాదన్న అర్థం వచ్చేలా ఈ పద్యం సాగుతుంది. యుద్ధానికి దిగని పాండవులను కూడా కౌరవులు చేతగాని వారని భావించి నష్టపోయారని గుర్తు చేస్తుంది.

సంబంధిత వార్తలు