దూబే హతమయ్యాడని తెలిసి స్వీట్లు పంచుకున్న బిక్రూ గ్రామస్థులు

- Advertisement -

కాన్పూర్: 8 మంది పోలీసులను హతమార్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ అయ్యాడని తెలిసి అతడి సొంతూరైన బిక్రూ గ్రామస్థులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే పీడ విరుగడైందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు తామెంతో సంతోషంగా ఉన్నామని, తమకు స్వేచ్ఛ లభించినట్లుగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ నెల 3న వికాస్ దూబేను అరెస్ట్ చేసేందుకు బిక్రూ గ్రామానికి వెళ్లిన పోలీసులపై దూబే గ్యాంగ్ కాల్పులు జరిపి పరారైంది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు చనిపోయారు.

అప్పటి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని తిరిగిన వికాశ్ గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఒక ఆలయం వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు.

అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించగా కాన్పూర్‌కు తరలిస్తున్న క్రమంలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

- Advertisement -