మొసలిని పట్టుకుని కూర వండుకుని తినేసిన గ్రామస్థులు

- Advertisement -

భువనేశ్వర్‌: మొసలిని పట్టుకున్న గ్రామస్థులు దానిని చంపి కూరవండుకుని తినేశారు. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒడిశా‌లోని మల్కన్‌గిరి జిల్లా పరిధి, కలదపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన కొందరు ఇటీవల ఒక మొసలిని పట్టుకుని దాన్ని చంపి కూర వండుకుని తలా ఇంత తినేశారు.

గ్రామస్థులు మొసలిని చంపి కూర వండుకుని తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మల్కన్‌ జిల్లా అటవీశాఖ అధికారులు మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా అటవీ అధికారి ప్రదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితులకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -