కరోనా భయంతో చికిత్సకు ఆస్పత్రుల నో.. గర్భిణీ మృతి

- Advertisement -

డెహ్రాడూన్: కరోనా భయంతో చికిత్స చేయడానికి నాలుగు ఆస్పత్రులు నిరాకరించడంతో 24 ఏళ్ల యువతి మృత్యువుపాలైంది. నిండు గర్భవతైన సుధ అనే ఆమెకు ఏడో నెలలోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.

ఇది గమనించిన సుధ భర్త సైనీ.. ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమెకు కరోనా ఉండొచ్చనే భయంతో ఆస్పత్రిలో చేర్చుకోవడానికి, చికిత్స చేయడానికి ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి.

- Advertisement -

మరో రెండు నెలలు ఆగి 9నెలలు నిండాక రావాలని చెప్పి బలవంతంగా వెనక్కు పంపేశాయి. ఈ సమాధానం విని కంగుతిన్న సైనీ.. మరో మూడు హాస్పిటల్స్‌కు వెళ్లాడు. అక్కడ కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కలుగజేసుకోవడంతో ఓ ఆస్పత్రిలో ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే సుధ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

అయితే ప్రసవం సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆమె అనారోగ్యం పాలయింది. దీనికితోడు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలిద్దరూ గంటల వ్యవధిలోనే మరణించారు.

ఈ విషయం తెలిసిన సుధ మానసికంగా కుంగిపోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె మృత్యువాత పడింది. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపించాలని అధికారులను డెహ్రాడూన్ సీఎంవో ఆదేశించారు.

- Advertisement -