కోవై సరళ పొలిటికల్ ఎంట్రీ ! పోటీ ఎక్కడి నుండో తెలుసా!

4:20 pm, Fri, 8 March 19
Kovai Sarala political entry, News xpressonlineKovai Sarala political entry, News xpressonline

కోయంబత్తూరు: ప్రముఖ హాస్యనటి కోవై సరళ తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యంలో చేరారు. కమల్‌ హాసన్ కోవై సరళను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కమల్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు సరళ.

రాజకీయ నాయకురాలిగా రాణిస్తుందా..

ఎంఎన్ఎం పార్టీ కోసం కమల్ సూచనల మేరకు పని చేసేందుకు సిద్ధమన్నారు. కోవై సరళ సేవలు పార్టీకి చాలా అవసరమన్నారు కమల్ హాసన్. పార్టీ బలోపేతానికి ఆమె సహకారం తీసుకుంటామన్నారు. మరోవైపు కోవై సరళ చేరిక తమకు కలిసొస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుందంటున్నారు.

అంతేకాదు హాస్య నటిగా గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా.. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగంతో ఆకట్టుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమల్‌హాసన్‌-కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చిన సతీలీలావతి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తర్వాత కమల్ కాంభినేషన్‌లో చాలా సినిమాల్లో కోవై సరళ నటించారు. మరి సినిమా కెరీర్‌లో సక్సెస్ సాధించిన సరళ.. పొలిటికల్ కెరీర్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.