అన్నింట్లోనూ తాతగారి లాగే.. అంతే ఘనంగా ఎన్టీఆర్ పెళ్లి…

11:21 am, Sun, 5 May 19

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది అతని అద్భుతమైన నటన, అబ్బుర పరిచే డ్యాన్స్.. ఎన్టీఆర్ మనవడిగా ఆయన వారసత్వం, రూపం మాత్రమే కాకుండా అన్నగారిలా అందరినీ మెప్పించే నటన, వాక్చాతుర్యం, వినయశీలత వంటి ఎన్నో సుగుణాలను పుణికిపుచ్చుకున్నాడు మన చిన్న ఎన్టీవోడు.

Related image

జూనియర్ ఎన్టీఆర్ అచ్చూ సీనియర్ ఎన్టీఆర్‌లా ఉంటాడని ఇప్పుడు అందరూ అంటున్నారుగానీ, ఈ విషయాన్ని అందరి కంటే ముందు గ్రహించింది అన్న గారే. అందుకే హరికృష్ణ తారక్‌కు పెట్టిన ‘తారక్ రామ్’ అన్న పేరుని ‘నందమూరి తారక రామారావుగా’ మార్చి ‘నా పేరు నిలబెట్టాలి..’ అని ఆశీర్వదించారు.

ఇక తాత నందమూరి తారక రామారావు గారి చేతే ‘తాతా…’ అని పిలిపించుకున్న ఏకైక మనవడు ఎన్టీఆర్ మాత్రమే.

Image result for jr ntr andsr ntr

ఒకే నెలలో పుట్టినరోజు – పెళ్లి రోజు…

ఈ తాతా-మనవళ్ళ పోలికలే కాదు.. పుట్టినరోజులూ దగ్గరే. 1923 మే 28వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ జన్మించగా.. సరిగ్గా ఆయన పుట్టిన 60 ఏళ్ళకు అంటే 1983వ సంవత్సరంలో అదే మే నెలలో 20వ తేదీన జూనియర్ పుట్టాడు. జూనియర్‌కి 11ఏళ్ళు వచ్చే వరకూ తాతగారి దర్శనం జరగలేదు.

బుడ్డోడు ఒక్కసారి కలిసే తాత గారి పేరు తనకు పెట్టించేసుకున్నాడు. తాతకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయనతో కలిసి ఆడుకున్నాడు. ఆ మధుర స్మృతులనే ఇప్పటికీ నెమరు వేసుకుంటాడు తారక రాముడు.

Image result for jr ntr marriage card

పుట్టిన రోజులే కాదు.. ఈ రాములోరి కళ్యాణాలు కూడా ఒకే నెలలో జరగడం విశేషం. అది కూడా తాత- మనవళ్లు ఇద్దరూ పుట్టిన మే నెలలోనే జరిగాయి. పెద్ద ఎన్టీఆర్ పెళ్లి 1942వ సంవత్సరం మే 2న జరిగితే.. 69 ఏళ్ల తర్వాత అంటే 2011లో మే 5వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరగడం విశేషం.

అంటే సరిగ్గా నేటికీ ఎన్టీఆర్ వివాహం జరిగి 8 వసంతాలు పూర్తయ్యాయి. వీరివురి వయసుకీ 60 ఏళ్ల తేడా ఉంటే.. ఇరువురి పెళ్ళిళ్ళకి 69 ఏళ్ళు తేడా ఉంది. 3 రోజుల తేడాతో పెళ్లిరోజులు, 8 రోజుల తేడాతో పుట్టినరోజులు..  దీనిని యాదృచ్చికం అనాలో… లేక దైవ నిర్ణయం అనాలో…

Image result for nandamuri taraka rama rao wife

అంగరంగ వైభవంగా తాతా – మనవళ్ళ వివాహాలు…

ఇప్పట్లో పెళ్లిళ్ళంటే ఖర్చులు ఆకాశాన్ని అంటడం కామన్. కానీ.., అప్పట్లో అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాలంలో ఇంత అట్టహాసంగా పెళ్లిళ్లు జరిగేవి కావు. కానీ కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామంలో బసవ రామ తారకమ్మ గారితో నందమూరి తారక రామారావు గారి వివాహం జరిగిన తీరు చూసి యావత్ జిల్లా మొత్తం ముక్కున వేలేసుకుందట.

అప్పటి వరకూ ఏ పెళ్లీ అంత అంగరంగ వైభవంగా జరగలేదట. ఆకాశమంత పందిరి.. నక్షత్రాల్లాఎటు చూసినా బంధు- మిత్రుల హడావిడే.. ఆ పెళ్ళికి విచ్చేసిన బంధువుల దగ్గర నుండి గ్రామస్థుల వరకూ కనులవిందుగా జరిగిన తారక రాముల వివాహం- కడుపునిండుగా పెట్టిన విందు తిని ప్రతి ఒక్కరూ ఔరా అనుకున్నారట. మళ్ళీ అదే తరహాలో జూనియర్ తారక రామారావు వివాహం జరిగింది.

Image result for jr ntr marriage photos hd

భారీ బడ్జెట్‌తో తారక రామ కళ్యాణం…  

నందమూరి తారక రామారావు- లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగినట్టు అప్పటి వరకూ ఏ హీరో పెళ్లి అంత వైభవంగా జరగలేదు. పెళ్లి పత్రిక మొదలు కళ్యాణ మండపం, వివాహ విందు వరకూ అన్నీ వర్ణనాతీతమే. ముత్తాతల ఫోటోల దగ్గర నుండి తాతయ్య-నాయనమ్మల ఫోటోల వరకూ వేయించిన ఎన్టీఆర్ శుభలేఖ చూస్తే అది “పెళ్లి పత్రిక కాదు అందమైన పెళ్లి పుస్తకం”  అనిపించక మానదు.

Image result for జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ

ఒక్కో పెళ్లి పత్రిక రూ.3000లతో అచ్చైనది కదా ఆ మాత్రం లేకపోతే ఎలా మరి? ఇక కళ్యాణ మండపం విషయానికి వస్తే ఓ భారీ బడ్జెట్ సినిమాకి వేసిన సెట్టింగులా కనిపించింది. ఒక్క కళ్యాణ మండపానికే రూ.18 కోట్లు ఖర్చైంది అంటే ఇక విందు ఎంత అమోఘంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

సుమారు 100 రకాల వంటలతో ఎన్టీఆర్ పెళ్లి భోజనం భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం మీదా ఎన్టీఆర్ పెళ్లి బడ్జెట్ రూ.100 కోట్లకు చేరిందని అంచనా. మరి ఇప్పటి వరకూ అంత బడ్జెట్‌తో ఎన్టీఆర్ సినిమానే తియ్యలేదు.

Image result for jr ntr marriage mandapam

సీతా రాముల కళ్యాణాన్ని తలపించే విధంగా జరిగిన ఈ పెళ్ళికి సినీ-రాజకీయ ప్రముఖులతో పాటు వేల సంఖ్యలో నందమూరి అభిమానులు తరలి రావడం గొప్ప విషయం. అభిమానులకి పెద్ద పీట వేస్తూ ఎన్టీఆర్ ఆహ్వానించిన తీరు ఆయనపై ఉన్న అభిమానాన్ని మరో మెట్టు ఎక్కించింది.

పెళ్లి పత్రికల మొదలు పెళ్లి విందు వరకూ కనీవినీ ఎరుగని రీతిలో కమనీయంగా- రమణీయంగా- అత్యంత వైభవంగా చిన్న ఎన్టీవోడి వివాహం జరిగి నేటితో 8 వసంతాలు పూర్తయ్యాయి. చూడముచ్చటైన ప్రణతీ- తారక్ జంటకు మా ‘న్యూస్ ఎక్స్‌ప్రెస్’ తరపున శుభాకాంక్షలు..

“లక్ష్మీ ప్రణతీ సమేత నందమూరి తారక రామునికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..”