ఆతృతగా ఉంది.. ‘పింక్’ టెస్టుపై కోహ్లీ

- Advertisement -

కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి తొలి పింక్‌బాల్ టెస్టు ప్రారంభం కానుంది. తొలిసారి డే నైట్ ఆడనున్న కోహ్లీ సేన ఆ బాల్‌తోనే ప్రాక్టీస్ చేసింది. రేపటి మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కొంచెం ఆతృతగా ఉందని అన్నాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో ఉత్సాహాన్ని కలిగించడానికి ఇది కొత్త మార్గం అని తన అభిప్రాయమన్నాడు. ఈ విషయంలో తాము చాలా సంతోషిస్తున్నట్టు కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇంతకు ముందు ఎర్రబంతితో ఆడామని, ఇప్పుడు డే-నైట్‌ టెస్టులకు పింక్‌ బాల్‌ని వినియోగిస్తున్నట్టు చెప్పాడు. దీంతో ఆ బంతితోనే ప్రాక్టీస్‌ మొదలు పెట్టినట్టు పేర్కొన్నాడు. పింక్‌ బాల్‌తో ఆడిన అనుభం భిన్నంగా ఉందని, రెడ్‌‌బాల్‌ కన్నా పింక్‌ బాల్‌ ఎక్కువ స్వింగ్ అవుతుందన్నాడు.

ఎర్రబంతితో ఆడి, ఒక్కసారిగా పింక్ బాల్‌తో ఆడడం కొంచెం కఠినంగా అనిపించిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఎందుకంటే ఆ బంతిపై పూత ఎక్కువగా ఉందన్నాడు. బంతిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందన్నాడు.

పింక్‌ బాల్‌తో ఆడడాన్ని అందరూ ఆస్వాదిస్తారని పేర్కొన్నాడు. పింక్‌బాల్‌ వల్ల బౌలర్లకు అదనపు ప్రయోజనం కలుగుతుంది కోహ్లీ తెలిపాడు.

- Advertisement -