పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన తెలంగాణ ప్రభుత్వం

10:35 pm, Sat, 6 June 20

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. సోమవారం నుంచి తెలంగాణలో మిగిలిన పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, శనివారం నాటి హైకోర్టు తీర్పుతో పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. 

 పదో తరగతి పరీక్షల నిర్వహణపై విచారించిన హైకోర్టు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పును ఇచ్చింది.

అయితే, ఈ రెండింటినీ మినహాయించి మిగతా చోట్ల పరీక్షలు నిర్వహిస్తే గందరగోళం తప్పదని భావించిన ప్రభుత్వం  రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.