వరంగల్‌లో రేపు 144 సెక్షన్, ఎందుకంటే…

Warangal
- Advertisement -

Warangal

వరంగల్‌: వరంగల్‌ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున గ్రూప్ -4 పరీక్షల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ -4 పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆయా పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు.  దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, పరీక్ష కేంద్రల వద్ద పోలీసుల అనుమతి లేకుండా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

- Advertisement -