తెలంగాణ ప్రజలను భయపెడుతున్న కరోనా మరణాలు.. నేడు 14 మంది బలి!

10:42 pm, Sun, 7 June 20

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. నేడు ఒక్క రోజే ఏకంగా 154 కేసులు నమోదు కాగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 

తాజా కేసుల్లో 132 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌‌లో 3, యాదాద్రిలో 2, సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌లో ఒక్కో కేసు నమోదు అయింది.

ఇప్పటివరకూ 3,650 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా మొత్తం 137 మంది మృతి చెందారు. ఇంకా 1,771 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అలాగే, 1,742 మంది డిశ్చార్జ్‌ అయినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.