ఏపీలో వైసీపీకి 20, తెలంగాణలో కేసీఆర్ కు 15 ఎంపీ సీట్లు! ఎన్డీటీవీ తాజా సర్వే!

9:54 am, Mon, 8 April 19
ndtv survey

అమరావతి: మరో మూడు రోజుల్లో తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓటర్లు ఓటు వేయనుండటంతో, పలు సర్వే సంస్థలు ప్రజల నాడిని పసిగట్టేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ, తొలి దశ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించింది.

17 లోక్ సభ సీట్లున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఇతరులు 2 చోట్ల గెలుస్తారని పేర్కొంది. 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది.

ఇదే సమయంలో 39 సీట్లున్న తమిళనాడులో డీఎంకే 25 చోట్ల విజయం సాధిస్తుందని, 21 సీట్లున్న ఒడిశాలో బిజూ జనతాదళ్ 16 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు 30 సీట్ల వరకూ రావచ్చని పేర్కొంది.
ఎన్డీయేకు 280 సీట్ల వరకూ రాకుంటే, ఈ పార్టీలు కీలకమని, బీజేపీకి 20 సీట్లు అవసరమైతే టీఆర్ఎస్,

స్వతంత్రులు, 40 సీట్ల వరకూ అవసరమైతే టీఆర్ఎస్, స్వతంత్రులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ సహకరించే అవకాశాలు ఉన్నాయని ఎన్డీటీవీ వెల్లడించింది. ఇక ఎన్డీయేకు భారీ నష్టం కలిగితే మాత్రం, ప్రాంతీయ పార్టీలదే హవా అవుతుందని, అప్పుడు కేసీఆర్ గొంతుక జాతీయ స్థాయిలో వినిపిస్తుందని అభిప్రాయపడింది.

ndtv surveyఇక ఫెడరల్ ఫ్రంట్ స్థాపన తన కలగా చెప్పుకుంటున్న కేసీఆర్, ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని నమ్ముతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ఆయన, జాతీయ స్థాయిలో తాను క్రియాశీలక పాత్రను పోషించాలని భావిస్తున్నారు.