కరోనా అప్‌డేట్: తెలంగాణలో 24 గంటల్లో.. 2,734 పాజిటివ్‌ కేసులు, 9 మంది మృతి

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697కు చేరగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 836కు చేరుకుంది. 

- Advertisement -

కరోనా బారిన పడిన వారిలో సోమవారం ఒక్కరోజే 9 మంది మరణించగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 347 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 2,325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 95,162కు చేరింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బారిన పడిన 31,699 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 24,598 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో  పేర్కొంది. 

 

 

- Advertisement -