తెలంగాణలో నేడు కూడా 500 మార్క్ దాటేసిన కేసులు.. జీహెచ్ఎంసీ పరిధిలో భయంకరంగా పెరుగుతున్న కేసుల సంఖ్య

10:20 pm, Sat, 20 June 20

హైదరాబాద్‌: తెలంగాణలో నేడు కొత్తగా 546 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 458 కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19తో నేడు ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వ్యాధి నుంచి కోలుకుని నేడు 154 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 203 మంది మరణించారు. నేడు కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు 7,072 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,363 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 3,506 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.