తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలు.. ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్…

cm-kcr-in-74th-independence-day-celebration-at-pragathi-bhavan
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ గోల్కొండ కోటలో జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రగతిభవన్‌కు మార్చారు. 

- Advertisement -
చదవండి: 74వ స్వాతంత్ర్య దినోత్సవం: ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ…

కేవలం ముఖ్యనేతలు, కొద్దిమంది అధికారుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి వెళ్లి అమరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే పోరాటంలో భాగంగా త్యాగాలను చేసిన వారిని స్మరించుకున్నారు. 

sircilla-ktr-flag-hoistingసిరిసిల్లలో మంత్రి కేటీఆర్…

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సిరిసిల్లలో ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఈసారి స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, వివిధ శాఖల అధికారులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

వారి సంకల్ప బలానికి సలాం: కవిత వీడియో సందేశం

74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

కరోనా బాధితుల కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తనకు స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. ‘వారి సంకల్ప బలానికి నా సలాం..’ అంటూ ఆ వీడియోలో కవిత వ్యాఖ్యానించారు.

చదవండి: వికేంద్రీకరణే సరైన విధానం.. మూడు ప్రాంతాలకూ సమన్యాయం: పంద్రాగస్టు వేడుకల్లో వైఎస్ జగన్
- Advertisement -