తెలంగాణలో భీకరంగా పెరుగుతున్న కరోనా కేసులు.. వణుకుతున్న హైదరాబాద్

- Advertisement -

హైరదాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భీకరంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. గురువారం ఒక్క రోజే ఏకంగా 920 మంది కరోనా బాధితులుగా మారారు.

వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 11,364కి చేరింది. వీరిలో 4,688 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఇంకా 6,446 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

కరోనా మహమ్మారి సోకి నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 230కి పెరిగింది. ఇక, నిన్న నమోదైన కొత్త కేసుల్లో 737 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌‌లో 60, కరీంనగర్‌‌లో 13, సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మూడేసి, ములుగు, వరంగల్‌ అర్బన్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి, వరంగల్‌ రూరల్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

- Advertisement -