ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్ ఉద్ధృతి

8:06 pm, Mon, 25 May 20
covid19-positive-cases-in-india-cross-78000-mark

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ బులిటెన్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 44 మందికి కరోనా సోకింది.

దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,671కి పెరిగింది. అలాగే ఈ వైరస్ నుంచి కోలుకుని 1848 మంది డిశ్చార్జి కాగా, 767 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.  కరోనా కాటుకు మొత్తంగా 56 మంది మృతి చెందారు.

ఇక తెలంగాణలోనూ కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 10 రోజుల్లో ఏకంగా 19 మంది కరోనాతో మృతి చెందారు.

అలాగే ఈ నెల 15 నుంచి 25వ తేదీ మధ్య హైదరాబాద్‌లో 313 కేసులు నమోదయ్యాయి.  24వ తేదీ వరకు తెలంగాణలో 1854 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు.

అలాగే ప్రస్తుతం 709 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 1092 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.