టీఆర్‌ఎస్‌ను వెంటాడుతున్న కరోనా.. మరో ఎమ్యెల్యేకు పాజిటివ్!

- Advertisement -

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ అని

వెల్లడయింది. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కరోనా టెస్ట్ చేయించుకోగా.. ఈ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ ఫలితం వచ్చింది. ప్రస్తుతం అదే ఆస్పత్రిలో ఆయన

- Advertisement -

చికిత్స పొందుతున్నారు. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి కరోనా పాజిటివ్ అని ఆదివారం తేలింది. ఇలా ఒకే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా రావడంతో వారిని కలిసిన అధికారులు,

పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఎమ్మెల్యే బిగాల.. ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలిన ముత్తిరెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన నుంచే బిగాలకు కరోనా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

- Advertisement -