టీఆర్ఎస్ నేతకి టీటీడీలో చోటు కల్పించనున్న జగన్…!

11:35 am, Tue, 4 June 19
APCM YS Jagan News, TRS Latest News, AP Political News, Newsxpressonline

హైదరాబాద్: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో…తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా మారనుంది. ఇప్పటికే బోర్డులో ఉన్న కొందరు రాజీనామా చేశారు. ఇక త్వరలోనే కొత్త టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులని నియమించనున్నారు.

అయితే టీటీడీ బోర్డు సభ్యుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించే ఆనవాయితీ ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ ఆనవాయితీ కొనసాగింది. పలు రాష్ట్రాలకి చెందిన ప్రముఖులని టీటీడీలో సభ్యులుగా నియమించారు.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్…తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టీటీడీబోర్డు సభ్యుడిగా నియమిస్తారని తెలుస్తోంది. కాగా, పొంగులేటి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించి, ఆపై టీఆర్ఎస్ లో చేరారు.

అయితే పొంగులేటి పార్టీ మారిన… జగన్ పై తన అభిమానాన్ని చూపిస్తూనే వచ్చారు. దీంతో జగన్ పొంగులేటికి టీటీడీ బోర్డ్ సభ్యుడి పదవిని ఇస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక గతంలో ఇదే ఖమ్మం సత్తుపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యని చంద్రబాబు టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించిన విషయం తెల్సిందే.

చదవండిచంద్రబాబుని విజయసాయి వదలట్లేదుగా…బాబుకి ప్రజల సొమ్ము అంటే చులకనా…!