బాలాపూర్ గణేశుడు ఈసారి ఆరడుగులే.. కీలక నిర్ణయం తీసుకున్న ఉత్సవ కమిటీ

- Advertisement -
హైదరాబాద్: వినాయక చవితి దగ్గరపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి విగ్రహాన్ని ఆరు అడుగుల ఎత్తులో మాత్రమే ప్రతిష్ఠించాలని నిర్ణయించింది.
 
అలాగే, ఈ ఏడాది లడ్డూ వేలంపాట నిర్వహించకూడదని నిర్ణయించారు. పూజలు, దర్శనాలకు భక్తులను అనుమతించకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
 
శోభాయాత్ర నాటికి అప్పటి పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలను మార్చుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -