బాసర అమ్మవారి కిరీటంలో రత్నం మాయం!

2:04 pm, Mon, 6 May 19
Basara-Saraswati-Ammavaru

బాసర : ముఖ ఆథ్యాత్మిక క్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో మరోసారి కలకలం రేగింది. ఈసారి ఏకంగా అమ్మవారి కిరీటంలోని రత్నం మాయమైంది. గత కొన్ని రోజులుగా ఈ రత్నం కనిపించడం లేదు.

అయినప్పటికీ విషయం బయటకు రాకుండా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. చివరకు విషయం బయటకు పొక్కడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2006లో అమ్మావారికి కానుకగా సమర్పించిన ఓ కిరాటానిిక ఓ భక్తుడు వజ్రాలు, రత్నాలను పొదిగించారు.

వీటిలో ఒక రత్నం ఇప్పుడు మాయమైంది. ఈ విషయంపై అర్చకులు స్పందిస్తూ, పూజలు చేసే సమయంలో ఒక్కోసారి వజ్రం జారిపోతుంటుందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.