సంచలనం: బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా.. పరిపూర్ణానంద స్వామి, జూబ్లీహిల్స్ నుంచి పోటీ…

parupurna nanda
- Advertisement -

parupurna nanda

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామిని బరిలోకి దింపనుంది. అందులో భాగంగానే పరిపూర్ణానంద స్వామి తాజాగా బీజేపీలో చేరినట్లు సమాచారం. కొంతకాలంగా పరిపూర్ణానంద బీజేపీతో సత్సంబంధాలు పెంచుకోవడమేకాక, ఇప్పటికే పలుమార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కూాడా కలిశారు.

- Advertisement -

ఈ నెల 8న అమిత్ షాతో సమావేశమైన పరిపూర్ణానంద స్వామి భారతీయ జనతా పార్టీలో చేరికపై చర్చించారు. ఈ శుక్రవారం బీజేపీలో చేరనున్నట్లు  ఆయనతో చెప్పినట్లు  తెలుస్తోంది. చెప్పినట్లుగానే శుక్రవారం అమిత్ షా సమక్షంలో పరిపూర్ణానంద స్వామి బీజేపీ చేరారు.

అంతకుముందు రాంమాధవ్, అమిత్ షా పరిపూర్ణానంద స్వామితో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణలో పరిపూర్ణానంద స్వామి పోటీపై చర్చించారు. పరిపూర్ణానంద స్వామి ఆంధ్రా ఓటర్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు తాను ఏమీ ఆశించకుండా పార్టీలో చేరానని, బీజేపీ సిద్ధాంతాలను నలుమూలల వ్యాపింప చేయడమే తన లక్ష్యమని పరిపూర్ణానంద స్వామి చెప్పారు. తనకు ప్రజలు ఎన్నో ఇచ్చారని, అంతకు మించి తనకు ఏమీ అవసరంలేదని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరానని, ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాం మాధవ్ నేతృత్వంలో పని చేస్తానని  పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేశారు

- Advertisement -