పద్ధతి మార్చుకోకపోతే.. కఠిన చర్యలు తప్పవు: సీఈఓ రజత్‌ కుమార్‌

ceo rajat kumar disappoint to district election officers over video conference
- Advertisement -

ceo rajat kumar disappoint to district election officers over video conference

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) రజత్‌ కుమార్‌ పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల అధికారులకు ఆయన పలు సూచనలిస్తున్నారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లు, విధివిధానాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజత్ మాట్లాడారు.

- Advertisement -

పలు జిల్లాలలోని ఎన్నికల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లను చాలా తేలికగా తీసుకుంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఆ అధికారులు తమ పద్దతిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయని, అంతేకాక గిరిజన ప్రాంతాల్లో కూడా తాను పర్యటిస్తానని తెలియజేశారు.

తెలుగులో మాత్రమే అభ్యర్థుల పేర్లు…

హైదరాబాద్‌తో సహా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో అభ్యర్ధుల పేర్లు తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో ఉంటాయని, మిగిలిన నియోజకవర్గాల్లో కేవలం తెలుగులో మాత్రమే అభ్యర్థుల పేర్లు ఉంటాయని ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ తెలిపారు.

అలాగే తెలంగాణలో నివసిస్తున్న 179 మంది రోహ్యింగాల ఓట్లు తొలిగించామన్నారు పరకాల ఉప ఎన్నికల నుంచి బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల ఫోటోలు పెట్టే పద్దతిని ప్రవేశ పెట్టినట్లు ఆయన గుర్తుచేశారు.

రాజకీయ నాయకులకు హెలీప్యాడ్‌ ఏర్పాట్లతో సీఈఓకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒక ఎయిర్‌ అంబులెన్స్‌ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాలు పెంచడం లేదన్నారు.

అలవెన్స్‌లు పెంచాలని కేంద్రాన్ని కోరాం…

తెలంగాణలోని రాష్ట్ర ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న అలవెన్స్‌ పెంపు తమ పరిధిలోనే ఉంటుందని, కేంద్ర ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా అలవెన్స్‌ చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల అలవెన్స్‌కు సంబంధించి ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఇద్దరు అదనపు ఎన్నికల అధికారుల నియమకాలపై కేంద్రం ఇంకా ఏమీ చెప్పలేదని, అలాగే ఎన్నికల బందోబస్తుకు ఏపీ పోలీసుల సహాయం కోరడం లేదని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -