ఫెడరల్ ఫ్రంట్: 13న స్టాలిన్‌తో భేటీ కానున్న కేసీఆర్…

9:45 am, Tue, 7 May 19
cm-kcr-to-meet-stalin-on-may-13-

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పక్షాలకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయిన కేసీఆర్…ఈ నెల 13న చెన్నైలో డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

అప్పటికి ఆరో దశ పోలింగ్ కూడా పూర్తవుతుంది. దీంతో దేశంలోని రాజకీయ పరిస్థితులు, అప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి, ఫలితాల అనంతరం తలెత్తే పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశాలపై కేసీఆర్ స్టాలిన్‌తో చర్చించనున్నారు.

చదవండిమళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు….

ఇక సోమవారం కేరళ సీఎంతో భేటీ అయిన కేసీఆర్.. ఆయన్ని ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కోరారు. దాదాపు గంటన్నర సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపాదనలు ఆచరణీయమని విజయన్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఐదు దశలు అయ్యాయి. మిగిలిన రెండు దశలు కూడా ఈ నెల 19న ముగుస్తాయి.  23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఫెడరల్ ఫ్రంట్  ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

చదవండి: బాబు పోలవరం టూర్ కి డుమ్మా కొట్టిన కీలక అధికారులు! కారణం ఏమిటి!