శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో.. సూర్యాపేటకు సంతోష్‌బాబు కుటుంబం

- Advertisement -

హైదరాబాద్: భారత్-చైనా మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు (39) భార్య, పిల్లలు ఈ ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేట బయలుదేరారు. సోమవారం రాత్రి భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసి స్వస్థలం సూర్యాపేట విషాదంలో మునిగిపోయింది.

- Advertisement -

 

16వ బీహార్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న సంతోష్‌బాబు గతేడాది మార్చిలో చివరిసారి సూర్యాపేట వచ్చారు. చెల్లెలు శ్రుతి పెళ్లి రోజు కావడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

సంతోష్‌ తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు.

- Advertisement -