నేడు సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు

- Advertisement -

సూర్యపేట: లడఖ్‌లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు నేడు సైనిక లాంఛనాల మధ్య జరగనున్నాయి.

నిజానికి నిన్ననే ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, పార్థివదేహం ఆలస్యంగా సూర్యాపేటకు చేరుకోవడంతో అంత్యక్రియలు నేడు నిర్వహించాలని నిర్ణయించారు.

- Advertisement -

కేసారంలో సంతోష్‌బాబు కుటుంబానికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కలెకర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.

ప్రజల సందర్శనార్థం సంతోష్ పార్థివదేశాన్ని ఈ ఉదయం 8 గంటల వరకు ఉంచనున్నట్టు పేర్కొన్నారు. పార్థివ దేహాన్ని సందర్శించే క్రమంలో ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. బంధనల ప్రకారం అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమించనున్నట్టు పేర్కొన్నారు.

సంతోష్‌బాబు భౌతికకాయం బుధవారం రాత్రి 11.40 గంటలకు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకుంది. పార్థివదేహం వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌లో సంతోష్‌బాబు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుథ్‌ వచ్చారు.

ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌నుంచి సంతోష్‌ నివాసం వరకు ప్రజలు కొవ్వొత్తులు, జాతీయ జెండాలతో రోడ్డుకు ఇరువైపులా ఉండి అమరవీరుడికి జైజైలు పలికారు.

సంతోష్‌బాబు అమర్‌రహే, భారత్‌మాతాకీ జై అనే నినాదాలతో సూర్యాపేట మార్మోగింది. కాగా, కల్నల్‌ సంతోష్‌బాబు పార్థి«వదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, సంతోష్‌బాబు సతీమణి సంతోషి చిన్నారులను చూసుకుంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

- Advertisement -