ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్, టీఆర్ఎస్…

7:18 am, Sat, 11 May 19
telangana congress leaders fires on kcr

హైదరాబాద్: తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకి సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో ఖాళీలు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 14న నామినేషన్ దాఖలు చెయ్యాల్సిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన నేడు నేతలు భేటీ అయ్యి ఎన్నికలపై చర్చించనున్నారు. ఇక ఈ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతోపాటూ పార్టీ సీనియర్ నేతలు హాజరుకాబోతున్నారు.

చదవండి: బాబు వ్యూహానికి జగన్ ప్రతి వ్యూహం!

ఈసారి పాత ఓటర్లకే ఓటు హక్కు అవకాశాన్ని ఈసీ కల్పించింది. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ… కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. ఇక అటు నుంచీ స్పందన రాకపోవడంతో, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలా లేదా అనే విషయంపై చర్చలు జరపనున్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్ధులు ఖరారు?

అటు కేసీఆర్ ఈరోజు కొందరు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ  భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.

అలాగే వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక నల్గొండ జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు.  ఈ స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంపిక చేసినా, ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానంపై ఆసక్తిగా ఉన్నారు. గుత్తా కాకపోతే ఈ స్థానానికి కె.శశిధర్ రెడ్డి, వేనపల్లి చందర్ రావు, తేర చిన్నపురెడ్డిల్లో ఎవరికోరిని బరిలో దించనున్నారు.

చదవండిట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: చివరికి కొత్త యాజమాన్యంతో కొలువుదీరిన టీవీ9….