కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన శనివారం అపోలో ఆసుపత్రిలో చేరగా ఈ విషయం బయటపడింది. 

అక్కడి వైద్యులు ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఫలితం పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కే చెందిన మరో నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఇటీవల వైరస్ బారినపడ్డారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు.

మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇప్పటికే కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితోపాటు ఆయన భార్య, వంట మనిషి, డ్రైవర్ కూడా కరోనా వైరస్ బారిన పడగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకు కూడా కరోనా సోకింది. 

మరోవైపు తెలంగాణలో కరోనా ఉద్ధృతి కాస్త కూడా తగ్గకపోగా మరింత పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 730 కేసులు వెలుగు చూడగా, కరోనా బారిన పడిన వారిలో ఏడుగురు మృతి చెందారు.

- Advertisement -