తెలంగాణలో 50 వేలు దాటేసిన కేసులు.. జిల్లాలను భయపెడుతున్న మహమ్మారి

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు కొత్తగా 1,567 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అలాగే, 9 మంది మృతి చెందారు.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి వారి సంఖ్య 50,826కు పెరిగింది. అలాగే, కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 447కు పెరిగింది.

- Advertisement -

కరోనా నుంచి తాజాగా 1,661 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 39,327కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా  11,052 యాక్టివ్‌గా ఉన్నాయి. 

నేడు నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 662 కేసులు వెలుగు చూడగా, ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 213, వరంగల్ అర్బన్‌లో 75, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 62, మహబూబ్‌నగర్‌లో 61, నాగర్ కర్నూలులో 51 కేసులు నమోదయ్యాయి. 

- Advertisement -