తెలంగాణలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కేసులు.. నేడు 975 నమోదు

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నేడు కొత్తగా 975 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 253 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 15,394కి చేరింది. ఇంకా 9,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 5,582 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్త కేసుల్లో నేడు జీహెచ్‌ఎంసీలో 861 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి గ్రేటర్‌లో 11,813కు కరోనా పాజిటివ్‌ కేసులు చేరుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్‌‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెంలో 8, వరంగల్‌ రూరల్‌‌లో 5, వరంగల్‌ అర్బన్‌లో 4 కేసులున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌‌లో 3, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. సిద్దిపేట, కుమ్రం భీం, గద్వాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది.

- Advertisement -