తెలంగాణలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 42 పాజిటివ్ కేసులు నమోదు…

10:10 pm, Tue, 19 May 20
coronavirus-positive-cases-cross-49000-in-india

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వీటిలో 34 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1634కు చేరింది.

చదవండి: వీడెవడండీ బాబు!: విజిటింగ్ వీసాపై అమెరికా వెళ్లి.. 24 ఏళ్లుగా అక్కడే మకాం, చివరికి…

కరోనాతో నేడు నలుగురు మృతి చెందగా, ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 38కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉండగా, 1011 మంది డిశ్చార్జి అయ్యారు.

మరోవైపు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 57 కొత్త కేసులు నమోదయ్యాయి. 691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1596 మంది కరోనా బారి నుంచి కోలుకోగా, 52 మరణించారు.

చదవండి: పగబట్టిన ‘కరోనా’.. ఓ కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్.. తండ్రికి రెండుసార్లు…