తెలంగాణలో భయం.. భయం! పెరుగుతున్న పాజిటివ్ కేసులు, నేడు ఒక్క రోజే 269 కేసులు…

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి.

అలాగే, ఈ మహమ్మారికి ఒకరు బలయ్యారు. నేడు నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 214 మంది మహమ్మారి బారినపడ్డారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగామలో 5, ములుగులో 5, మెదక్‌లో 3, సంగారెడ్డిలో 3, వనపర్తిలో 2, మేడ్చల్ లో 2, జయశంకర్ భూపలపల్లి, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్‌లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,675 మంది బాధితులుగా మారారు. బుధవారం 151 మంది  కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3071 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2412 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

 

- Advertisement -