తెలంగాణలో నిన్న తగ్గి నేడు పెరిగిన కరోనా కేసులు

9:24 pm, Thu, 21 May 20
coronavirus-positive-cases-cross-49000-in-india

హైదరాబాద్: తెలంగాణలో నిన్న తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు నేడు మళ్లీ పెరిగాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదయ్యయి.

కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 26, రంగారెడ్డి జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.  అలాగే, పది మంది వలస కూలీలకు కరోనా సోకింది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1699 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.

తాజాగా నేడు కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది.

నేడు 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు 1036 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా యాక్టివ్‌ 618 కేసులు ఉన్నాయి.

వీరందరికి చికిత్స కొనసాగుతున్నట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.