నేడు కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణలో భక్తులు

8:20 am, Tue, 12 November 19

హైదరాబాద్: కార్తీక మాసంలో శుక్లపక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి. ఈ కార్తీక పౌర్ణమి శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం.

కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు బారులు తీరారు. భద్రాచలం గోదావరి నదీ తీరంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తిక దీపాలు వదులుతున్నారు.

జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే తుంగభద్ర నది తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.