వైద్యుల నిర్లక్ష్యం.. బ్రతికున్న మహిళ చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్

1:09 pm, Mon, 3 June 19

జగిత్యాల: వైద్యుల నిర్లక్ష్యానికి ప్రతీక ఈ ఘటన. ప్రమాదంలో గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తే… బ్రతికున్నా చనిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చేశారు. దీంతో కన్నీటిపర్యంతమైన కుటుంబీకులు… బంధువులకు సమాచారమిచ్చి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే లాస్ట్ మినిట్ లో చనిపోయింది అనుకున్న మహిళ శ్వాస తీసుకుంటుందని గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

చదవండి: కేబినెట్‌లో అన్నీ కులాలకి ప్రాతినిద్యం కల్పించనున్న జగన్….

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగంపేటకు చెందిన కనుకమ్మకు ఓ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలయ్యాయ్. దీంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా… ఆమెకు వైద్యం అందించారు. అనంతరం కనుకమ్మ చనిపోయిందని నిర్ధారించారు.

దీంతో ఆమెను తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా ఒక్కసారిగా లేచిందని చెబుతున్నారు కుటుంబీకులు. ఇలాంటి డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.