ఎర్రగడ్డ రైతు బజారులో కరోనా కల్లోలం.. మూడు రోజులు మూత

- Advertisement -

హైదరాబాద్: ఎర్రగడ్డ రైతు బజారులోని ఓ కాంట్రాక్టర్‌ కరోనా వైరస్‌తో మృతి చెందడంతో మూడు రోజుల పాటు రైతు బజారును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

రైతు బజారును శానిటైజ్ చేసిన అధికారులు వ్యాపారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

- Advertisement -

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. రైతు బజారులోని వ్యాపారి కరోనాతో మరణించిన విషయం తెలిసిన కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు.

- Advertisement -