టీవీ9 రవి ప్రకాశ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు..

7:43 am, Tue, 14 May 19

హైదరాబాద్: ఏపీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 యాజమాన్య సంస్థ అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడటం, ఫోర్జరీ పత్రాల సృష్టించారని, నటుడు శివాజీతో కలిసి నకిలీ పత్రాలు తయారు చేశారని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే దీనిపై పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా, రవి ప్రకాశ్ స్పందించక పోవడంతో సోమవారం సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేశారు.

చదవండిటీవీ9 సీఈ‌వో పదవి నుంచి తొలగింపు వార్తలపై స్పందించిన రవి ప్రకాశ్…

బంజారాహిల్స్ లోని రవిప్రకాశ్ నివాసానికి వెళ్లిన పోలీసులకు, ఆయన కనిపించక పోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇక మంగళవారం నాడు సైబర్ క్రైప్ పీఎస్ లో విచారణకు రాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇక ఈ కేసులో ఉన్న నటుడు శివాజీ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి ఈరోజు అయిన రవి ప్రకాశ్ విచారణకి హాజరవుతారో లేదో చూడాలి. ఒకవేళ హాజరుకాకపోతే  పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.

చదవండిట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: చివరికి కొత్త యాజమాన్యంతో కొలువుదీరిన టీవీ9….