హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది ఘాతుకం

fire-in-hyd
- Advertisement -

fire-in-hyd

హైదరాబాద్: నగరంలోని టప్పాచబుత్రలో దారుణం జరిగింది. తనని ప్రేమించలేదనే కోపంతో అజీనా బేగం అనే యువతిపై ఇబ్రహీం అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  దాదాపు 90 శాతం కాలిపోయిన అజీనా బేగంని వెంటనే ఉస్మానియా అస్పత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకుని అల్లాడుతున్నఆమెని కాపాడే ప్రయత్నంలో అజీనా బేగం అన్న, వదినలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇబ్రహీం కూడా 40 శాతం గాయపడ్డాడు.

- Advertisement -

పేస్‌బుక్ ప్రేమే కారణమా…?

స్థానికంగా టప్పాచబుత్రలో నివాసముండే ఇబ్రహీం గల్ఫ్‌లో ఉద్యోగం చేసి ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. గల్ప్‌లో ఉన్న సమయంలోనే  స్దానికంగా ఉన్న అజీనాబేగం అనే యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. అయితే  హైదరాబాద్ వచ్చిన ఇబ్రహీం ఆ యువతిని కలిసేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ఇబ్రహిం గురించి ఆరా తీయగా అతడికి అంతకు ముందే పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం తెలుసుకుంది. ఇప్పటి నుండి అతడి ప్రేమను నిరాకరించి అతడిని దూరం పెడుతూ వచ్చింది. దీంతో ఆమెపై పగను పెంచుకున్నాడు.

ఈ క్రమంలో శనివారం నాడు అజీనాబేగం ఇంటికి వెళ్ళి మాట్లాడాలంటూ పిలిచాడు. అజీనాబేగం బయటకు వచ్చిన వెంటనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమె పై పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో కొంత పెట్రోల్ ఇబ్రహీంపై పడి అతడు కూడా గాయపడ్డాడు. అజీనాబేగం పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమచారం అందిన వెంటనే  ఫోలీసులు సంఘటన స్థాలనికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -