హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట: ముందస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత…

High Court
- Advertisement -

High Court

హైదరాబాద్: హైకోర్టులో కేసీఆర్  ప్రభుత్వానికి ఊరట లభించింది. ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ, శశాంక్ రెడ్డిల పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ అంశం హైకోర్టు ఎదుట విచారణకు రాగా హైకోర్టు వాటిని కొట్టివేసింది.

- Advertisement -

చదవండి: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై.. హైకోర్టులో డీకే అరుణ పిటిషన్…

ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అరుణ, శశాంక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న కోర్టు… తెలంగాణ ప్రభుత్వం వాదనలతో ఏకీభవించింది.  కేబినెట్ తుది నిర్ణయం ఉందని చెబుతూ  ప్రభుత్వం తరుపున వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ముందస్తు ఎన్నికలపై వేసిన అన్నిపిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.

- Advertisement -